పంచాయతీ రాజ్ ఉద్యోగి ఇళ్లలో ఏసీబీ సోదాలు | Panchayat Raj employee Searches in the homes of acb | Sakshi
Sakshi News home page

పంచాయతీ రాజ్ ఉద్యోగి ఇళ్లలో ఏసీబీ సోదాలు

Mar 20 2014 5:58 AM | Updated on Sep 2 2017 4:57 AM

ఆదాయూనికి మించి ఆస్తులు ఉన్నాయున్న ఆరోపణలపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పంచాయతీ రాజ్ కార్యాలయు ఏఈ ఆదివిష్ణు సంపత్‌కువూర్ ఇళ్లపై బుధవారం ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు అతనిని అరెస్ట్ చేశారు.

 ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ : ఆదాయూనికి మించి ఆస్తులు ఉన్నాయున్న ఆరోపణలపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పంచాయతీ రాజ్ కార్యాలయు ఏఈ ఆదివిష్ణు సంపత్‌కువూర్ ఇళ్లపై బుధవారం ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు అతనిని అరెస్ట్ చేశారు.
 
 ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నారుు.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలోని ప్రకాష్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఏఈ ఆదివిష్ణు సంపత్‌కువూర్ సీతానగరం పంచాయతీ కార్యాలయుంలో వుండల అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 1984లో డ్రాఫ్ట్‌మెన్‌గా పశ్చివుగోదావరి జిల్లాలో పనిచేశాడు.
 
 1992లో ఏఈగా పదోన్నతి రావడంతో జిల్లాలోని కొవ్వూరు, దేవరపల్లి, జంగారెడ్డిగూడెంలో పనిచేశారు. అనంతరం బదిలీపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం వె ళ్లాడు. అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్న ఆయన అందినకాడకు దండుకుంటున్నాడ నే ఆరోపణలు ఉన్నారుు.
 
 దొరికిపోరుుందిలా..
 పాలకొల్లు పంచాయతీ రాజ్ కార్యాలయుంలో ఏఈగా పనిచేసిన వుుక్కావుుల వెంకట సత్యనారాయుణ ఆదాయూనికి మించి ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో అతనితో పాటు బంధువుల ఇళ్లపై గతనెల 18వ తేదీన దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారిస్తున్న అధికారులకు వెంకట సత్యనారాయుణ, సంపత్‌కువూర్‌లు స్నేహితులని తెలిసింది.
 
 వీరిద్ద రూ వురో స్నేహితుడు కలిసి వచ్చిన సొవుు్మతో విశాఖపట్నంలోని భీమిలిలో రూ.34 లక్షలతో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ విషయం వెంకట సత్యనారాయుణ  రికార్డులు, పత్రాలను పరిశీలిస్తుండగా వెలుగులోకి వచ్చింది. ఆరా తీసిన ఏసీబీ అధికారులు సంపత్ కుమార్‌పై కూడా కేసునమోదుచేశారు.
 
 దాడి చేసిందిలా..
 బుధవారం ఉదయుం ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విల్సన్, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోరుు సీతానగరంలోని సంపత్‌కువూర్ ఇంటిపై, రాజవుండ్రిలోని అతని తండ్రి రాధాకృష్ణ ఇంటిపై, అతని స్నేహితుడు జోగేశ్వరరావు, విజయువాడలోని అతని వూవుయ్యు పద్మలోచనరావు ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాడుల్లో సంతప్‌కువూర్‌కు చెందిన కేజీ బంగారం, ఏడు ఎకరాలు పొలం దస్తావేజులు, ఆరు ఫ్లాట్‌లు, ఆరు ఇళ్ల స్థలాలు, మోటార్ సైకిళ్లు, కారుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సువూరు రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంపత్‌కువూర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆస్తులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement