ఆ మూడు భవనాలు వద్దు | News about Provision of temporary High Courts | Sakshi
Sakshi News home page

ఆ మూడు భవనాలు వద్దు

Feb 23 2018 2:45 AM | Updated on Aug 31 2018 8:40 PM

సాక్షి, హైదరాబాద్‌: అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ భవనం, కృష్ణా జిల్లా జూపూడిలోని నిమ్రా కళాశాల భవనం, వెటర్నరీ యూనివర్సిటీ భవనాల పట్ల హైకోర్టు న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్టు విముఖత చూపింది.

ఇదే సమయంలో నేలపాడు వద్ద జస్టిస్‌ సిటీలో నిర్మించే సిటీ సివిల్‌ కోర్టు భవనంలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించింది. జస్టిస్‌ సిటీలో సిటీ సివిల్‌ కోర్టు భవన నిర్మాణం పూర్తయిన వెంటనే హైకోర్టును అక్కడికి తరలించేందుకు న్యాయ మూర్తులందరూ అంగీకరించారు. ఇక్కడ హైకోర్టు కోసం మొత్తం 19 కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement