ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో నాటా సేవా డేస్ ముగింపోత్సవం సందర్బంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో నాటా సేవా డేస్ ముగింపోత్సవం సందర్బంగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో పలు వేదికల్లో జరగనున్నాయి.
ఉదయం 10 గంటల నుంచి 12 వరకు రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక అమీర్పేట మేరీగోల్డ్ హోటల్ (గ్రీన్స్లాండ్)లో నాటా సన్షైన్ ఇంటర్నేషనల్ సీఎంఈ కార్యక్రమం 10 నుంచి 4 గంటలకు వరకు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు బంజారాహిల్స్ హోటల్ తాజ్ బంజారాలో బిజినెస్ సెమినార్ ఉంటుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ రెండో సంవత్సరంలో ప్రతి జిల్లా నుంచి టాపర్లుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులకు మధ్యాహ్నం స్కాలర్షిప్లు అందజేశారు.