పార్లమెంటులో వైఎస్సార్‌ విగ్రహం ప్రతిష్టించాలి | MP Vallabhaneni Balashowry Letter To Speaker Om Birla Over YSR Statue | Sakshi
Sakshi News home page

పార్లమెంటులో వైఎస్సార్‌ విగ్రహం ప్రతిష్టించాలి

Jul 8 2019 8:33 AM | Updated on Jul 8 2019 12:25 PM

MP Vallabhaneni Balashowry Letter To Speaker Om Birla Over YSR Statue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. రూపాయి డాక్టర్‌గా వైద్య సేవలు అందించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు పోలవరం, పులిచింతల ప్రాజెక్టులతో వైఎస్సార్‌ జలయఙ్ఞానికి శ్రీకారం చుట్టారని బాలశౌరి లేఖలో పేర్కొన్నారు. అటువంటి మహానేత విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించి.. ఆయనను సముచితంగా గౌరవించాలని విన్నవించారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వైఎస్సార్‌ పథకాలను దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయని లేఖలో పేర్కొన్నారు. జూలై 8న (సోమవారం) మహానేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటు విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement