ఇప్పుడో.. ఎప్పుడో! | Sakshi
Sakshi News home page

ఇప్పుడో.. ఎప్పుడో!

Published Sun, Oct 15 2017 11:14 AM

Mitra Engineering College was seized by Triple IT Officers - Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్‌: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ తరలింపుపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ముందుగా జూలైలో షిఫ్టు చేస్తామన్నారు.. తర్వాత దసరా అనంతరం ముహూర్తం ఖరారు చేశారు కానీ ఇంకా చర్యలు మాత్రం తీసుకోలేదు. ప్రస్తుతం అన్ని వసతులు ఉన్నా, తరగతుల తరలింపులో మాత్రం జాప్యం జరగుతోంది. ప్రస్తుతం మొదటి ఏడాది పీయూసీకి సంబంధించి మొదటి సెమిస్టర్‌ నిర్వహణకు సమయం దగ్గర పడింది. నవంబర్‌లో పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెమిస్టర్‌ తరువాత ఇక్కడికి షిఫ్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. సెమిస్టర్‌ పరీక్ష నిర్వహణ తర్వాత డిసెంబర్‌లో తరగతులు షిప్టుంగ్‌ చేస్తారా? లేదా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి సెలవులు జనవరిలో ఉంటాయి. డిసెంబర్‌లో సెమిస్టర్‌ గ్యాప్‌ ఉంటుంది. షిఫ్టింగ్‌ సమయం ఈ రెండింటిలో ఒక సమయానికి ప్రాధాన్యమివ్వక తప్పని పరిస్థితి!  

అన్నీ సిద్ధం చేసినా..
ప్రస్తుతం మిత్రా ఇంజినీరింగ్‌ కళాశాలను ట్రిపుల్‌ ఐటీ అ«ధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెలకు రూ. 4 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ట్రిపుల్‌ ఐటీ అధికారుల సూచనల మేరకు భవనాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం మొదటి ఏడాది 1000 మంది విద్యార్థులకు వసతి సిద్ధం చేశారు. ఇంటర్‌నెట్‌ ఏర్పాటు తప్ప మిగిలిన పనులన్నీ పూర్తి చేశారు. ప్రస్తుతం స్థానిక ట్రిపుల్‌ ఐటీ భవనాల్లో మహిళల క్యాంపస్, మిత్రా కళాశాలలో పురుషుల క్యాంపస్‌ నిర్వహించాలి. అయితే మొదటి ఏడాది తరగతులు ఇక్కడ ప్రారంభం కాలేదు. జూలైలో ఇక్కడకు షిఫ్టు చేస్తున్నట్లు చెప్పారు. మిత్రా కళాశాల సెప్టెంబర్‌ 16న నిర్ధారణ కమిటీ నిర్వహణకు అనుమతులిచ్చింది. దసరా సెలవుల అనంతరం ఇక్కడికి తరగతులు షిఫ్టు చేస్తున్నట్లు అధికారులు చెప్పా రు. అయితే అమలు కాలేదు. మిత్రా కళాశాల, ట్రిపుల్‌ ఐటీ భవనాలు రెండూ పూర్తయ్యా యి. కానీ తరగతుల ప్రారంభానికి చర్యలు తీసుకోలేదు.
 
ఈ రెండూ కీలకం..

మరోపక్క ఇక్కడికి తరగతులు షిఫ్టు చేయటం, వచ్చే విద్యా సంవత్సరం జూలై నాటికి రెండు వేల మందికి వసతి సౌకర్యం కల్పించడం కీలకం. ప్రారంభంలో నిర్మాణ పనులు ఏపీ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించారు. ప్రస్తుతం రాజీవ్‌ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ విభాగం పనులు సమీక్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం 199.08 ఎకరాలు కేటాయించింది. మరోపక్క డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ నుంచి 22.42 ఎకరాలు, రాజీవ్‌ స్వగృహ నుంచి 49.66 ఎకరాలు ట్రిపుల్‌ ఐటీకి అప్పగించారు. ఈ స్థానంలో ఆయా సంస్థలకు వేరే స్థలాలు అప్పగించాలి. ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మరోపక్క ఎస్‌ఎం పురానికి చెందిన కొందరు తమకు ఈ ప్రాంతంలో గతంలో పట్టాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

షిఫ్టింగ్‌పై ప్రత్యేక దృష్టి
ట్రిపుల్‌ ఐటీ షిఫ్టింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. త్వరలో ఇక్కడికి తరగతులు షిఫ్టు చేస్తాం. తరగతుల నిర్వహణకు ఇక్కడ పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేస్తున్నాం. స్థా ని కంగా మహిళల క్యాంపస్, మిత్రా ఇంజినీరింగ్‌ క ళా శాలలో పురుషుల క్యాంపస్‌ నిర్వహిస్తాం. ఉన్నతా ధికారులకు నిరంతరం ఇక్కడి పరిస్థితి వివరిస్తున్నాం.
– ప్రొఫెసర్‌ హరశ్రీరాములు, డైరెక్టర్,
 శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ

Advertisement

తప్పక చదవండి

Advertisement