ఆటో డ్రైవర్‌కి లక్ష బహుమతి | Million gift to the auto driver | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌కి లక్ష బహుమతి

Jan 4 2015 1:11 AM | Updated on Aug 20 2018 8:20 PM

ఆటో డ్రైవర్‌కి లక్ష బహుమతి - Sakshi

ఆటో డ్రైవర్‌కి లక్ష బహుమతి

ఆటో డ్రైవరు గుడుమూరు పోలి నాయుడును అదృష్టం వరించింది. గోపాలపట్నం ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్‌లో శనివారం

విజేత పేరు ప్రకటించిన ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ అధినేత
ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్‌లో సంక్రాంతి సంబరాలు
కొనుగోలుదారుల సందడి

 
 గోపాలపట్నం: ఆటో డ్రైవరు గుడుమూరు పోలి నాయుడును అదృష్టం వరించింది. గోపాలపట్నం ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్‌లో శనివారం సాక్షి-ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కొనుగోలుదారుల సందడి నడుమ లక్ష రూపాయల బంపర్ డ్రా నిర్వహిం చారు. శుక్రవారం నాటి డ్రా విజేత శరగడం హేమంత్‌కుమార్ తొలి డ్రా తీశారు. ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ అధినేత ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి విజేత పేరు ప్రకటించారు. మల్కాపురానికి చెందిన ఆటోడ్రైవరు గుడుమూరు పోలినాయుడుకి సాక్షి యాడ్స్ ఏజీఎం బి.రంగనాథ్ ఫోన్లో అభినందనలు తెలిపారు. తాను తన మేనల్లుడు మణికంఠ పేరుతో ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్‌లో దుస్తులు కొనుగోలు చేశానని పోలినాయుడు ఉబ్బితబ్బిబ్బవుతూ చెప్పాడు. తనకు సంక్రాంతి సంబరాల్లో లక్ష రూపాయల డ్రా వరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ స్టోర్ ఆపరేషన్ ఇన్‌చార్జి ఎల్.రమణారెడ్డి,  సాక్షి యాడ్స్ ఆఫీసర్ ఎన్.వి.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
 ఐదుగురికి లక్ష బహుమతులు

 ఇంత వరకూ ఐదుగురు కొనుగోలుదారులకు లక్షరూపాయల బహుమతులు వరించాయి. ఇంకా 25మందికి పైగా కన్సోలేషన్ బహుమతులు లభించాయి. మరో మూడు రోజులు డ్రా ఉంటుంది. ఇంతే కాదు. డ్రాలతో సంబంధం లేకుండా ప్రతి కొనుగోలుదారునికీ రూ.200 నుంచి రూ.1000 వరకు గిఫ్టు కూపన్లు ఇస్తున్నాం. సంక్రాంతి సంబరాల్లో ఇంకా ఎన్నో బహుమతులు ఇస్తున్నాం. సంక్రాంతి వేడుకల్లో లేటెస్టు వెరైటీలు అందుబాటులో ఉంచాం. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తోంది.     

- ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి, ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ అధినేత
 
జీవితంలో  తొలి బహుమతి


నాకు ఇది జీవితంలో మరువలేని తొలి బహుమతి. సాక్షి సంబరాల్లో  లక్ష రూపాయలు డ్రా వరించడం ఇప్పటికీ నా తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. సాక్షి సంబరాలు నిజంగా కొనుగోలుదారులకు వరం.
 - శరగడం హేమంత్‌కుమార్, ఎంటెక్ విద్యార్థి, పాతపెందుర్తి    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement