గ్రామాలకు సేవ అందించాలనే లక్ష్యంగా..

MEIL Providing Access to Clean Water in several villages - Sakshi

ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామి సంస్థ మేఘా ఇంజనీరింగ్ సామాజిక సేవలోనూ ముందుంటోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. మరోవైపు క్యాన్సర్ బాధిత చిన్నారులను అక్కున చేర్చుకుని, వారికి మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర సామగ్రిని అందిస్తోంది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో అత్యాధునిక వసతులతో క్యాన్సర్ బాధితుల కోసం అంకాలజీ భవనాన్ని నిర్మించి ఇచ్చింది. అంతేకాకుండా అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట కార్యక్రమాన్ని కూడా ఎంఇఐఎల్ నిర్వహిస్తున్నది.
 
అలాగే ఎంఇఐఎల్ తన సేవా కార్యక్రమాలను గ్రామాలకు విస్తరించింది. ఎలాంటి రాజకీయ ఎజెండా లేకుండా.. కేవలం గ్రామాలకు సేవ అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ గ్రామాలను దత్తత తీసుకొని వాటి వికాసానికి తనవంతు తోడ్పడుతోంది. ఏపీ, తెలంగాణలోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని  ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా జములపల్లిలో  రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను ఆధునీకరించి, ప్రతి ఇంటికి తాగునీరు, అలాగే సోలార్ ప్లాంట్ తోపాటు రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాలోని డోకిపర్రు, ఖాజా గ్రామాలను దత్తత తీసుకున్న ఎంఇఐఎల్ ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నది. డోకిపర్రులో కళ్యాణ మండపం, దేవాలయం నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు అందించింది. అలాగే రాయలసీమ ప్రాంతంలో నాగులాపురం,గంజిగుంటపల్లి గ్రామాలను దత్తత తీసుకుంది. ద

ఇక​ తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలోని పస్పుల, మురహరిదొడ్డి గ్రామాలను దత్తత తీసుకుని,రహదారులను నిర్మించడంతో పాటు సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రుల్లోని రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఎంఇఐఎల్ భోజనామృతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. తొలివిడతలో  నీలోఫర్‌తోపాటు ఉస్మానియాలో రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. ఇలా సంత్సరంలో దాదాపు 10 లక్షల మంది ఆకలి తీరుస్తున్నది. అలాగే ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిచేస్తోంది. దీంతోపాటు ప్రాణం ఫౌండేషన్‌కు చెందిన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యంతో పాటు, సద్దిమూట కార్యక్రమం ద్వారా సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ యార్డ్ లలో రైతులు, హమాలీల ఆకలి తీరుస్తున్నది.

నిమ్స్‌లో అత్యాధునిక అంకాలజీ భవనం
నిమ్స్‌లో అత్యాధునిక సదుపాయాలతో అంకాలజీ ఆసుపత్రి భవనాన్ని మేఘా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలను ఎంఇఐఎల్ కల్పించింది. ఇందులో ప్రత్యేక వార్డులతో పాటు.. ఐసీయూ, బెడ్లు, ఆక్సిజన్ సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయం, బెడ్ లిఫ్ట్‌ సౌకర్యం గత ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top