పుష్కర స్నానానికి వెళ్లి యువకుడు మృతి | Man dies accidentally at Godavari Pushkaralu in Rajahmundry | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానానికి వెళ్లి యువకుడు మృతి

Jul 16 2015 3:10 PM | Updated on Sep 3 2017 5:37 AM

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కరస్నానానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

తూర్పు గోదావరి (రాజమండ్రి రూరల్) : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కరస్నానానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ప్రమాదం కాటూరు రేవు వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన స్వామి(18) అనే యువకుడు స్నేహితులతో కలసి కాటేరులో ఉన్న అనధికార పుష్కరఘాట్ వద్ద స్నానానికి వెళ్లాడు. కాగా స్నానమాచరించే క్రమంలో స్వామి లోతుకి వెళ్లడంతో మునిగిపోయి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement