పార్టీ బలోపేతానికి కృషి చేయండి | Make the effort to strengthen the party | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

Mar 23 2015 2:44 AM | Updated on Aug 13 2018 4:11 PM

తమిళనాడులో వైఎస్సార్ సీపీ బలోపేతానికి వలంటీర్లు సైనికుల్లా కృషిచేయాలని వైఎస్‌ఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశించారు.

వలంటీర్లకు ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆదేశం
 

తిరుపతి రూరల్: తమిళనాడులో వైఎస్సార్ సీపీ బలోపేతానికి వలంటీర్లు సైనికుల్లా కృషిచేయాలని వైఎస్‌ఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. తమిళనాడుకు చెందిన వైఎస్సార్ సీపీ సేవాదళం వలంటీర్లు ఆదివారం తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వగృహానికి వచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వైఎస్సార్‌సీపీ సేవాదళం నూతన కమిటీ ఏర్పాటుపై చెవిరెడ్డితో చర్చించారు. చెవిరెడ్డి మాట్లాడుతూ తమిళనాడులో పార్టీని గ్రామగ్రామానికి విస్తరించాలని సూచించారు.

రెండు రోజులలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వైఎస్‌ఆర్ సేవాదళం నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలో తమిళనాడులో సేవాదళం ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో వైఎస్‌ఆర్ సేవాదళం చేపట్టిన కార్యక్రమాలు, ప్రజాసేవలను సేవాదళం నాయకులు జాకీర్ హుస్సేన్, శ్రీనివాసులురెడ్డి, రామక్రిష్ణారెడ్డి వివరించారు. సేవాదళం వలంటీర్లు వినోద్‌కుమార్, పవన్‌కుమార్, నరేంద్రరెడ్డి, సాయినాథ్‌రెడ్డి, మణికంఠేశ్వర్‌రెడ్డి, సురేష్, శ్రీకాంత్, రాజశేఖర్‌రెడ్డి, రత్నం, వెంకట్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement