
సాక్షి, విజయవాడ: చాపకింద నీరులా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో పటిష్టంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. విజయవాడలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు.(‘సీఏ’ పరీక్షలు వాయిదా)
కరోనా వ్యాప్తి నివారించడానికి కఠినంగా వ్యవహరించక తప్పదని ఏసీపీ నాగరాజా రెడ్డి తెలిపారు. హోం క్వారంటైన్ యాప్ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని వెల్లడించారు. పరిస్థితిని అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ సేవలకు సహకారం అందించేందుకు విప్రో సంస్థ ముందుకొచ్చిందని.. శానిటైజర్లు,హ్యాండ్ వాష్, కిట్లను పోలీసు సిబ్బందికి అందజేశారని పేర్కొన్నారు.
(కరోనా : కేంద్ర బలగాలు రావట్లేదు)