నేడు విజయవాడలో ‘భూ సమీకరణ’ సదస్సు | Land of the equation Conference to held today | Sakshi
Sakshi News home page

నేడు విజయవాడలో ‘భూ సమీకరణ’ సదస్సు

Nov 25 2014 6:30 AM | Updated on Sep 2 2017 5:06 PM

జయవాడలో మంగళవారం ఉదయం ‘రాజధాని భూ సేకరణ-ప్రజా ప్రయోజనాలు’ అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు జరగనుంది. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు.

విజయవాడలో మంగళవారం ఉదయం ‘రాజధాని భూ సేకరణ-ప్రజా ప్రయోజనాలు’ అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు జరగనుంది. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. బందరు రోడ్డులోని వైట్‌హౌస్ భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భూ సమీకరణ కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, రైతుల మనోభావాలు, ఇందువల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలపై వక్తలు ప్రసంగించనున్నారని నిర్వాహకులు తెలిపారు.
 
 ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ బి.రామకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు గట్టు రామచంద్రరావు, జర్నలిస్టుల యూనియన్ నేత ఉప్పల లక్ష్మణ్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు గొట్టిపాటి రామకృష్ణ, బీజీపీ రాష్ట్ర నాయకుడు శ్రీనివాసరాజు, లోక్‌సత్తా రాష్ట్ర నాయకులు చెన్నుపాటి వజీర్, డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ, గాంధీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ వేమూరి బసవ కుటుంబరావు, పర్యావరణవేత్త డాక్టర్ కె.బాబూరావు, రైతు నాయకులు మల్లెల శేషగిరిరావు, అనుమోలు గాంధీ, జర్నలిస్ట్ మేగజైన్ సంపాదకులు కృష్ణంరాజు వక్తలుగా హాజరు కానున్నారని నిర్వాహకులు వివరించారు.

Advertisement

పోల్

Advertisement