నేడు నల్లగొండకు కోదండరాం రాక | kodandaram reddy arrives nalgonda district to day | Sakshi
Sakshi News home page

నేడు నల్లగొండకు కోదండరాం రాక

Mar 1 2014 4:11 AM | Updated on Sep 2 2017 4:12 AM

జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయోత్సవ సభ ను విజయవంతం చేయాలని జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ-జాక్) జిల్లా చైర్మన్ వి.లక్ష్మీనారాయణయాదవ్‌లు వేర్వేరు ప్రకటనల్లో కోరారు.

నేడు నల్లగొండకు కోదండరాం రాక
 నల్లగొండ కల్చరల్/నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయోత్సవ సభ ను విజయవంతం చేయాలని జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ-జాక్) జిల్లా చైర్మన్ వి.లక్ష్మీనారాయణయాదవ్‌లు వేర్వేరు ప్రకటనల్లో కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్ పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారని, అనంతరం విజయోత్సవ సభ జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
 
 ఏర్పాట్ల పరిశీలన
 నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో శనివారం నిర్వహించనున్న విజయోత్సవ సభా ఏర్పాట్లను జేఏసీ జిల్లా నాయకులు జి.వెంకటేశ్వర్లు, గోలి అమరేందర్‌రెడ్డి, బోనగిరి దేవేందర్, పందుల సైదులు, బి.నాగార్జున, పాల్వాయి రవి, వీరయ్యవర్మ శుక్రవారం పరిశీలించారు.
 

Advertisement

పోల్

Advertisement