
సీఎం, డీజీపీ తోడు దొంగలు: వివేక్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ వివేక్ మరోసారి విరుచుకుపడ్డారు.
కరీంనగర్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ వివేక్ మరోసారి విరుచుకుపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులతో ప్రభుత్వ చర్చల విఫలం వెనుక సీఎం కిరణ్ కుట్ర ఉందని ఆరోపించారు. సీఎంను భర్తరఫ్ చేయాలని కోరుతూ ఈ మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్ను కలవనున్నట్టు తెలిపారు.
పీడీ యాక్ట్ కింద సీఎంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ, సీఎం తోడు దొంగలని ఎప్పుడో చెప్పామని వివేక్ అన్నారు. ముఖ్యమంత్రి డబ్బులిచ్చి, రెచ్చగొట్టేవారిని ప్రోత్సహిస్తున్నారని వివేక్ అంతకుముందు ఆరోపించారు. తన ప్రకటనలతో ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.