నీట మునిగిన గ్రామాలలో పర్యటించిన జేసీ

Joint Collector Of Kurnool Visited Submerged Villages In Mahanadi Mandal - Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా మహానంది మండలంలో నీటమునిగిన గ్రామాలను మంగళవారం జిల్లా జాయింట్‌​ కలెక్టర్‌ రవి పటాన్‌ శెట్టి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే నీట మునిగిన గ్రామాలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గండిపడిన చెరువులకు మరమ్మత్తులు చేయడంతో పాటు, నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు  నేడు, రేపు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. వరదనీటితో నిండిపోయిన గ్రామాల్లో తక్షణ వైద్యసాయం అందించాలంటూ సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు ఆయన వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టేందుకు రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేశామని, గ్రామ సమీపంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top