పీబీసీకి గండికొట్టిన జేసీ దివాకర్ రెడ్డి! | JC Diwakar Reddy breached to PBC | Sakshi
Sakshi News home page

పీబీసీకి గండికొట్టిన జేసీ దివాకర్ రెడ్డి!

Mar 30 2015 3:46 PM | Updated on Sep 2 2017 11:36 PM

జేసీ దివాకర్ రెడ్డి

జేసీ దివాకర్ రెడ్డి

ఎల్లనూరు మండలం సింగవరం వద్ద పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ యామిని బాల గండి కొట్టారు.

అనంతపురం: ఎల్లనూరు మండలం సింగవరం వద్ద పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్  యామిని బాల గండి కొట్టారు. ఈ చర్యను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో సింగవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులతో జేసీ దివాకర్ రెడ్డి, యామిని బాల వాగ్వివాదానికి దిగారు.

పీబీసీ కింద అనంతపురం జిల్లాలో 5వేల ఎకరాలు, వైఎస్‌ఆర్ జిల్లాలో 55వేల ఎకరాలు మొత్తం  60వేల ఎకరాల ఆయకట్టు ఉంది.   ఈ కెనాల్కు అంతంత మాత్రంగానే నీరు విడుదల చేస్తుంటారు.  అందులో ఎక్కువ భాగం నీరు అనంతపురం జిల్లా  రైతులే వాడేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement