జనసేనలో అంతర్గత విభేదాలు | Janasena Party In Disagreements Tirupati | Sakshi
Sakshi News home page

జనసేనలో అంతర్గత విభేదాలు

Jun 14 2018 2:52 AM | Updated on Jun 14 2018 2:57 AM

Janasena Party In Disagreements Tirupati - Sakshi

దాడిలో గాయపడ్డ సురేష్‌

తిరుపతి(అలిపిరి) : తిరుపతి జనసేన పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఓవర్గం నాయకులు మరో వర్గం నాయకులపై దాడిచేసే స్థాయికి దిగజారారు. బుధవారం జనసేన నాయకుడు సురేష్‌పై అదే పార్టీకి చెందిన మరో నాయకుడు సహచరులతో కలసి దాడి చేశారు.

దాడి నుంచి తప్పించుకున్న సురేష్‌ అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అనంతరం ఆ పార్టీనాయకుడు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలోనే మరో వర్గం నాయకులు గురువారెడ్డి సమాధుల వద్ద తనపై దాడి చేశారన్నారు. గతంలో నేరచరిత్ర ఉండి ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న వారి వల్ల జనసేన పార్టీ స్థాయి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement