వైఎస్ఆర్ సిపి తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతివ్వకపోవడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రేనని ఆ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణ రెడ్డి ఆరోపించారు.
అనంతపురం: వైఎస్ఆర్ సిపి తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతివ్వకపోవడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రేనని ఆ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణ రెడ్డి ఆరోపించారు. సమైక్యాంధ్రకు కట్టుబడ్డ ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు.
జగన్ నేతృత్వంలో సమైక్యాంధ్ర కోసం పోరాటాలు ఉధృతంగా సాగుతాయని ఆయన చెప్పారు. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.