అనంతలో పచ్చరచ్చ | issue of Tadapatri MLA JC prabhakarreddy | Sakshi
Sakshi News home page

అనంతలో పచ్చరచ్చ

Jul 23 2014 2:23 AM | Updated on Aug 10 2018 8:08 PM

అనంతలో పచ్చరచ్చ - Sakshi

అనంతలో పచ్చరచ్చ

ఈ నెల 24న సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ‘అనంత’ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. తమకు తెలియకుండా పార్టీలో ఎవర్నీ చేర్చుకోరాదంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం వీరంగం సృష్టించారు.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వీరంగం

 అనంతపురం : ఈ నెల 24న సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో ‘అనంత’ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. తమకు తెలియకుండా పార్టీలో ఎవర్నీ చేర్చుకోరాదంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం వీరంగం సృష్టించారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ మాసూం బాబాలను అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి టీడీపీలోకి ఆహ్వానించారు.

వారి చేరిక కోసం మంగళవారం నగరంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. విషయం తెలిసి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మందీ మార్బలంతో అక్కడికి చేరుకున్నారు. ‘మా అన్న(జేసీ దివాకరరెడ్డి) అనంతపురం ఎంపీ. పార్లమెంటు స్థానం పరిధిలో కొత్త వ్యక్తులను పార్టీలోకి చేర్చుకునే ముందు మాకు మాటమాత్రమైనా చెప్పరా..? వారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటావో చూస్తా.’ అని ఆగ్రహంతో ప్రభాకరచౌదరిని నిలదీశారు. పార్టీలోకి చేరడానికి వచ్చిన రషీద్ అహ్మద్, మాసూం బాబాలను బూతులు తిట్టారు. ఈ లోపు జేసీ అనుచరులు అక్కడున్న కుర్చీలు విసిరేసి ఫ్లెక్సీలు చించేశారు. తమకు తెలీకుండా ఎవరైనా ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఖబడ్దార్ అంటూ నిష్ర్కమించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement