జిల్లాలో దోపిడీ, కిడ్నాప్ తదితర నేరాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు పెద్దాపురం డీఎస్పీ వి. అరవిందబాబు తెలిపారు.
దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు
Sep 3 2013 6:13 AM | Updated on Aug 21 2018 9:20 PM
ప్రత్తిపాడు, న్యూస్‌లైన్ : జిల్లాలో దోపిడీ, కిడ్నాప్ తదితర నేరాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు పెద్దాపురం డీఎస్పీ వి. అరవిందబాబు తెలిపారు. వారిని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో సోమవా రం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఆకుల బాల రాజు, ఆకుల లోవరాజు కొంత మంది వ్యక్తులతో కలసి ముఠాగా ఏర్పడి జిల్లాలో అనేక నేరాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం కాకినాడ మాధవపట్నం పోస ్టల్ కాలనీలో ఉంటున్న ఆకుల బాల రాజు ముఠాను తయారు చేసి కిడ్నాప్‌లు, దారిదోపిడీలు, దొంగనోట్లు ఇస్తామని ప్రజలను నమ్మించి, మోసాలకు పాల్పడుతున్నాడు. తన ముఠాలోని కొంత మందికి ఖాకీ యూనిఫామ్ వేసి, పోలీసులమంటూ ప్రజలను బెది రించి, నేరాలకు పాల్పడేవాడు.
గత మార్చి 13న ప్రత్తిపాడు మండలం లంపకలోవ గ్రామానికి చెందిన ధాన్యం కమీషన్ వ్యాపారి పంది నానిబాబు తన మోటార్ సైకిల్‌పై లంపకలోవ రోడ్డులో నగదుతో వెళ్తుండగా బాల రాజు, లోవరాజులు బైక్‌పై వెంబడిం చారు. కళ్లలో కారం కొట్టి అతడి వద్ద నుంచి రూ.1,63,150 దోచుకుని పరారయ్యారు. అలాగే పాత కక్షల నేపథ్యంలో మరో ఆరుగురు స్నేహితులతో కలసి గత మే 20న వారి మేనల్లుడు లక్ష్మీనారాయణ ను పిఠాపురం మండ లం విరవ గ్రామంలో కిడ్నాప్ చేశారు. కొద్ది రోజులు కాకినాడలో ఉంచి, కాళ్లు చేతులు కట్టేసి, ప్రత్తిపాడు మండలం ఉద్దండ జగన్నాథపురం గ్రామం వద్ద ఏలేరు కాలువలో పడేశారు. జూలై 9న కాకినాడ ఓఆర్‌కే కంప్యూటర్ సెంటర్ యజమాని తడాల వీర వెంకట సత్యనారాయణ తన కారులో వెళ్తుండగా సామర్లకోట సుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసుల మంటూ అటకాయించి, కిడ్నాప్ చేశారు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
ఇవ్వకపోవడంతో అతడి వద్ద నున్న రెండు ఏటీఎం కార్డులు, రెండు సెల్‌ఫోన్లు లాక్కొ న్నారు. ఏటీఎం నుంచి కొంత నగదు డ్రా చేసుకున్నారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేయగా బాల రాజు మాత్రం పోలీసులకు చిక్కలేదు. 2009 లో కోనపాపపేట సర్పంచ్ కోడలిని కాకినాడ బీచ్‌రోడ్డులో అత్యాచార యత్నానికి ప్రయత్నించిన సంఘటనపై యు.కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో వీరిని అరెస్టు చేశారు. ఈ కేసు నమోదు కావడంతో అమీనాబాద్ గ్రామస్తులు వీరిని గ్రామం నుంచి పంపించి వేయగా అప్పటి నుంచి బాలరాజు కాకినాడలోనూ, లోవరాజు పిఠాపురం మండలం విరవాడ గ్రామం లో నివాసం ఏర్పరచుకుని నేరాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ అరవిందబాబు తెలిపారు.
పెద్దాపురం క్రైం సీఐ సురేష్ సమాచారం మేరకు ప్రత్తిపాడు సీఐ టి.రామ్మోహన్‌రెడ్డి, ఎస్సై వై.రవి కుమార్ ఆదివారం సాయంత్రం స్థానిక లంపకలోవ రోడ్డులో బాలరాజు, లోవరాజులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,10,500 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించా రు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ స్టేష న్ హెడ్ కానిస్టేబుల్ బి. నరసింహారావు తో పాటు స్థానిక పోలీసులు బలరామ్, టైసన్, రాధాకృష్ణ, శ్రీను, రంగబాబు, సత్తిబాబులను ఆయన అభినందించా రు. వీరికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానని పెద్దాపురం డీఎస్పీ వి. అరవిందబాబు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు సీఐ రామ్మోహన్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement