
పల్లె రఘునాథ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ప్రవాస భారతీయుల సహకారాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రం కోసం ఆర్థిక వనరులు సమీకరిస్తామని చెప్పారు. ఇందుకోసం ఒక వారంపాటు అమెరికాలో పర్యటిస్తానని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.