28 నుంచి చిల్డ్రన్ థియేటర్ ఫెస్టివల్ | Hyderabad to host children theatre festival from October 28 | Sakshi
Sakshi News home page

28 నుంచి చిల్డ్రన్ థియేటర్ ఫెస్టివల్

Oct 23 2013 5:07 AM | Updated on Sep 1 2017 11:52 PM

28 నుంచి చిల్డ్రన్ థియేటర్ ఫెస్టివల్

28 నుంచి చిల్డ్రన్ థియేటర్ ఫెస్టివల్

చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ నాల్గవ ఎడిషన్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరుగుతుందని సినీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ నాల్గవ ఎడిషన్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరుగుతుందని సినీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ తెలిపారు. మంగళవారమిక్కడ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ ఫెస్టివల్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పిల్లల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారికి మంచి కాలక్షేపాన్ని అందించేందుకు ఈ ఫెస్టివల్ దోహదపడుతుంద న్నారు. ముంబైకి చెందిన రంగాథియేటర్, ప్రాసేనియం ప్రొడక్షన్స్, న్యూఢిల్లీకి చెందిన కథకథా థియేటర్  తదితర ప్రఖ్యాత థియేటర్ గ్రూప్‌లు ఫెస్టివల్‌లో పాలుపంచుకుంటున్నాయన్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన నాటక సమాజాలను ఇక్కడి వారికి పరిచయం చేయడం దీని లక్ష్యమని నిర్వాహకురాలు వైశాలి బిష్ట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాలశాఖ డెరైక్టర్ సుభాష్‌గౌడ్ కూడా పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement