శెట్టికుంట గ్రామంలో ఉద్రిక్తత | High tension in setti kunta in ysr kadapa district | Sakshi
Sakshi News home page

శెట్టికుంట గ్రామంలో ఉద్రిక్తత

Jun 10 2014 10:14 AM | Updated on Aug 10 2018 6:49 PM

వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టికుంట గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది.

వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టికుంట గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  దాంతో ఇరుపార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఇరు పార్టీల వారు కార్యకర్తలను రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించారు.



గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన శెట్టికుంట గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికిటింగ్ ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement