వర్ష బీభత్సం | Heavy Rain In Vizianagaram | Sakshi
Sakshi News home page

వర్ష బీభత్సం

Sep 22 2018 12:04 PM | Updated on Sep 22 2018 12:04 PM

Heavy Rain In Vizianagaram - Sakshi

జలమయమైన సాలూరులోని రామాకాలనీ రోడ్డు

విజయనగరం, సాలూరు/తెర్లాం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా సాలూరు పట్ట ణంలోకి వరదనీరు చేరి స్థానికులను ఇబ్బంది పెట్టగా పెరుమాళివద్ద రాజాం – రామభద్రపు రం రోడ్డుపై భారీ చెట్టు నేలకూలి రాకపోకలకు అంతరాయం కలి గించింది. దీనివల్ల కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. సాలూరు పట్టణంలోని ఏపీఎస్‌ ఆర్టీసీ కాం ప్లెక్స్, రామాకాలనీ, జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలను కలిపే 26వ నంబరు జాతీయ రహదారిపై ఫిలడెల్ఫియా ఆసుపత్రివద్ద వరదనీరు ప్రవహించడంతో అటుగా వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏకధాటిగా కురిసిన వర్షానికి పాచిపెం ట మండలంలోని కొండలపైనుంచి వచ్చిన వరదనీరు ఒక్కసారిగా పట్టణంలోకి చేరడంతో సమస్య తలెత్తింది. ప్రధానంగా రామాకాలనీ, అఫీషియ ల్‌ కాలనీలో ని శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుగృహాల చుట్టూ వర్షపునీరు చేరడంతో ఇళ్లనుండి బయటకు రాలేకపోయారు.

ఆక్రమణలవల్లే ముంపు సమస్య
సాధారణంగా చెరకుపల్లి గెడ్డ, కూరగెడ్డలనుంచి వర్షపునీరు పట్టణంలోని పేరసాగరంలోకి చేరా ల్సివున్నా, కాలువలు మొత్తంఆక్రమణలకు గురికావడంతో సజావుగా నీరు పారక ముంపు సమస్య తలెత్తుతోంది. అలాగే మున్సిపల్‌ కమి షనర్‌ ఎం.ఎం.నాయుడు, ఇరిగేషన్‌శాఖ ఏఈ సాయితో కలసి ముంపు ప్రాంతా లను సందర్శించారు. ఈ సమస్య ముందుగానే ఊహించి ఇరిగేషన్‌శాఖ డీఈకి లేఖరాశానని, అయితే తమకు సంబంధంలేదని వారు బదులిచ్చారని కమిషనర్‌ విలేకరులకు తెలిపారు.

రహదారిపై కూలిన చెట్టు
గురువారం రాత్రి వీచిన పెనుగాలులు, భారీ వర్షానికి రాజాం–రామభద్రపురం రోడ్డులో పెరుమాళి దాటిన తరువాత పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడింది. దీని ప్రభావంతో రాష్ట్రీయ రహదారిపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారని తెలుసుకున్న తెర్లాం పోలీస్‌స్టేషన్‌ హెచ్‌సీ శ్రీనివాసరావు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడి, రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఉదయం 7–8గంటల ప్రాంతంలో రోడ్డుపై పడిన చెట్టును పూర్తిగా తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోవడంతో వాహన చోదకులు రాత్రంతా రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement