అధికారుల ముంగిట అభ్యర్థుల భవితవ్యం | Grama Sachivalayam Merit List Reached Prakasam | Sakshi
Sakshi News home page

అధికారుల ముంగిట అభ్యర్థుల భవితవ్యం

Sep 22 2019 10:09 AM | Updated on Sep 22 2019 10:09 AM

Grama Sachivalayam Merit List Reached Prakasam - Sakshi

శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం బిజీ బిజీగా మారిపోయింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి లోకల్‌ అభ్యర్ధులకు 80 శాతం, నాన్‌లోకల్‌ అభ్యర్ధులకు 20 శాతం కేటాయించారు. దీనిలో రిజర్వేషన్లు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలు), మెరిట్‌ ఆధారంగా తుది జాబితా సిద్ధం చేయనున్నారు. ఆదివారం సాయంత్రానికి తుది జాబితా సిద్ధం అవుతుందని సమాచారం. అర్హులైన అభ్యర్ధులకు నేడు లేక రేపు కాల్‌ లెటర్లు అందే అవకాశం కనిపిస్తోంది. కాల్‌ లెటర్లు పంపిణీ అనంతరం సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. అందుకోసం అధికారులతో 80 బృందాలు సిద్ధం చేశారు. అయితే వెరిఫికేషన్‌ కేంద్రాలు ఎక్కడనేది స్పష్టత రావాల్సి ఉంది. డీఆర్‌డీఏ కార్యాలయంతో పాటు మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనుననట్లు సమాచారం. జిల్లాలో గ్రామ, వార్డు కేటాగిరిల్లో 9900 ఉద్యోగాలు కేటాయించగా రాత పరీక్షకు 1,33,503 మంది హాజరయ్యారు. కాగా వారిలో 49,386 మంది క్వాలిఫై అయినట్లు సమాచారం. రోస్టర్‌ పాయింట్ల విడదీతకు జిల్లాలో అర్బన్‌ లోకల్‌ బాడీలకు సంబంధించి ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీనితోపాటు పలు శాఖలకు రోస్టరు పాయింట్ల విడదీత బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

జిల్లాలో గ్రామ, వార్డు కేటగిరీల్లో పోస్టులు 9900
రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య  1,33,503
క్వాలిఫై అయినవారిసంఖ్య 49,386

గ్రామ సచివాలయాల పోస్టులకు క్వాలిఫై అయిన అభ్యర్ధులు..
గ్రేడ్‌–5 పంచాయతీ సెక్రటరీ 10,800 మంది అర్హత సాధించగా, మహిళా పోలీస్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ అసిస్టెంట్, వార్డు ఉమెన్‌ వీకర్‌ సెక్షన్‌ అసిస్టెంట్లకు 2199, వెల్‌ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లకు 10800, గ్రేడ్‌–2 విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 1875, విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌లకు 239, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్లకు 268, గ్రేడ్‌–6 పంచాయతీ సెక్రటరీ (డిజిటల్‌ అసిస్టెంట్‌)లకు 607, యానిమల్‌ హస్పెండరీ అసిస్టెంట్‌లకు 328, గ్రేడ్‌–3 ఏఎన్‌ఎం, వార్డు హెల్త్‌ సెక్రటరీలకు 3019, సెరికల్చర్‌ అసిస్టెంట్లకు 83, గ్రేడ్‌–2 ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు 2406, గ్రేడ్‌–2 విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌లకు 1736, గ్రేడ్‌–3 విలేజ్‌ సర్వేయర్లకు 1736 మంది క్వాలిఫై అయ్యారు.

అర్బన్‌ లోకల్‌ బాడీ (యూఎల్‌బీ) లో క్వాలిఫై అయిన అభ్యర్ధులు...
జిల్లాలోని 8 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఆరు రకాల కేటాగిరి ఉద్యోగాల్లో ఒక్కోదానికి 171 పోస్టులను కేటాయించారు. వారిలో వార్డు అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీలకు 10801, గ్రేడ్‌–2 వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీలకు 196, గ్రేడ్‌ వార్డ్‌ ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ 256, వార్డు ఎడ్యుకేషన్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలకు 1538, వార్డు వెల్ఫేర్‌ డవలప్‌మెంట్‌ సెక్రటరీలకు 499, గ్రేడ్‌–2 వార్డు ఎనిమిటీస్‌ సెక్రటరీలకు 2406 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో మెరిట్, రిజర్వేషన్‌ ఇతర ప్రామాణికాల ప్రకారం ఒక్కో కేటాగిరిలో 171 మందిని ఎంపిక చేస్తారు. అయితే ఆరు కేటాగిరిలకు సంబందించి ఇప్పటికే పనిచేస్తున్న వారు 31 మంది ఉన్నారు. వీరిని మినాహాయించి మిగిలిన పోస్టులను భర్తీ చేస్తారు. అర్బన్‌ లోకల్‌ బాడీలకు సంబంధించి జిల్లాలోని ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు అద్దంకి, చీమకుర్తి, చీరాల, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, మార్కాపురం మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో మొత్తం ఆరు కేటగిరీల్లో 1026 ఉద్యోగాలు కేటాయించారు. అర్బన్‌ లోకల్‌ బాడీల్లో మొత్తం 1197 వార్డు సచివాలయాలు ఉన్నాయి.

​​​​​​​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement