ఆత్మకూరు నియోజకవర్గంలో 514 కిలోమీటర్ల పాదయాత్రను ఇటీవలే పూర్తి చేసిన వైఎస్సార్‌సీపీ...
సాక్షి, నెల్లూరు : ఆత్మకూరు నియోజకవర్గంలో 514 కిలోమీటర్ల పాదయాత్రను ఇటీవలే పూర్తి చేసిన వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి గడప గడపకు వైఎస్‌ఆర్‌సీపీ పేరుతో ఆదివారం నుంచి మరోయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఉద యం ఏఎస్‌పేట మండలం
తెల్లపాడు నుంచి ఈ గడపగడపకు వైఎస్సార్‌సీపీ యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని అన్ని గ్రామాలు, కాలనీల్లో గౌతమ్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లనున్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. దివంగత నేత వైఎస్సార్ సువర్ణ పాలన మళ్లీ చూడాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సి ఉందన్న విషయాన్ని గౌతమ్‌రెడ్డి వివరించనున్నారు.
రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు పలకాలని ఆయన కోరనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 38 రోజుల పాటు 514 కిలో మీటర్ల మేర 150కి పైగా గ్రామాల్లో గౌతమ్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ముగిసి పది రోజులు కాకమునుపే ఆయన మళ్లీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినీ కలిసేందుకు సిద్ధమయ్యారు.
38 రోజుల పాదయాత్రలో నియోజకవర్గ ప్రజల నుంచి గౌతమ్‌రెడ్డి ఘన స్వాగతం లభించింది. ఈ ఆదరణను స్ఫూర్తిగా తీసుకుని గౌతమ్‌రెడ్డి తిరిగి ప్రజల్లోకి వెళ్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్‌రెడ్డి పోటీకి దిగుతుండటం, తక్కువ కాలంలో ప్రజలకు చేరువ కావడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండటంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.