''నీరు- చెట్టు' దుర్వినియోగం కాకుండా చర్యలు'

'నీరు- చెట్టు' దుర్వినియోగం కాకుండా చర్యలు' - Sakshi


పండూరు (తూర్పు గోదావరి): 'నీరు- చెట్టు'  కార్యక్రమం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జిల్లా అధికారులకు సూచించారు. జిల్లాలోని పండూరులో పథకం పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 'నీరు- చెట్టు' మంచి పథకమని, ప్రజలు దీనికి సహకరించాలన్నారు.



గవర్నర్ నరసింహన్ సోమవారం రాజమండ్రిలో పర్యటించిన విషయం తెలిసిందే. నిర్మాణంలో ఉన్న కోటిలింగాలఘాట్‌ను పరిశీలించడంతో పాటు కోరకొండ మండలం శ్రీరంగపట్నంలో ‘నీరు - చెట్టు’ కార్యక్రమంలో పాల్గొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో పర్యటించారు. ఈ సందర్భంగా జాందానీ చీరల తయారీ కేంద్రాలను పరిశీలించి, తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న చేనేత సహాకార సంఘంలో జాందానీ చీరలను కొనుగోలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top