
శ్రీవారి ఆలయ ఆవరణలో కుటుంబ సభ్యులతో గెటప్ శ్రీను
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: నటుడు గెటప్ శ్రీను కుటుంబ సమేతంగా మంగళవారం చినవెంకన్న ఆలయాన్ని సందర్శించారు. శ్రీవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మాట్లాడుతూ.. టీవీ కామెడీ షోలతో పాటు ఇంత వరకు దాదాపు 50 సినిమాల్లో నటించానని చెప్పారు.
ఇటీవల రంగస్థలం చిత్రంతో మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమాలోను, సుమంత్ హీరోగా నటిస్తున్న సుబ్రహ్మణ్యం చిత్రంతో పాటు, మరో రెండు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు.