
సాక్షి, విజయవాడ : ఏపీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ని మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.మార్చి 10 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పరీక్షలకు 6.10 లక్షల మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారని గంటా చెప్పారు. వంద సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 27 పదో తరగతి ఫలితాలు వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు .
ఈ నెల 27 నుంచి మార్చి 18 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటర్ పరీక్షలకు దాదాపు 10,17,600 మంది హాజరుకానున్నట్లు అంచనా వేశారు. ఏప్రిల్ 12 ఇంటర్ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని ప్రకటించారు. హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. వీటితో పాటు వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను కూడా మంత్రి గంటా ప్రకటించారు. ఈ నెల 15న డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని.. మరో రెండు మూడు రోజుల్లో స్పెషల్ డీఎస్సీ ప్రకటిస్తామని వెల్లడించారు.