వైఎస్సార్‌ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు | Gadikota Srikanth Reddy Praises YS Rajasekhara Reddy In Anantapur | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు

Sep 25 2019 3:19 PM | Updated on Sep 25 2019 3:29 PM

Gadikota Srikanth Reddy Praises YS Rajasekhara Reddy In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : జలయజ్ఞాన్ని ప్రారంభించి హంద్రీనీవా ప్రాజెక్టును చేపట్టిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కదిరి ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా పూర్తిస్థాయిలో డిసెంబర్‌లోగా నీరిస్తామని అన్నారు. రాయచోటికి సంక్రాంతికి హంద్రీనీవా నీటిని అందిస్తామని తెలిపారు. అవినీతి జరిగిన ప్రాజెక్టులలో రివర్స్ టెండర్ల ద్వారా పనులు చేపడతామని చెప్పారు. రివర్స్ టెండర్ల ద్వారా రెండు పనుల్లోనే రూ. 750 కోట్ల ప్రజాధనాన్ని మిగిల్చామన్నారు. నామినేషన్ పనుల ద్వారా చంద్రబాబు బంధువు కంపెనీ నవయుగకు పనులు కట్టబెట్ట లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement