విజయోత్సాహం | fourth day of telangana celebrations in district | Sakshi
Sakshi News home page

విజయోత్సాహం

Feb 22 2014 2:11 AM | Updated on Oct 9 2018 5:27 PM

తెలంగాణ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభలు ఆమోద ముద్ర వేయడంతో శుక్రవారం తెలంగాణవాదులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.

 సాక్షి, మంచిర్యాల : జిల్లావ్యాప్తంగా నాలుగో రోజు కూడా తెలంగాణ సంబరాలు కొనసాగాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభలు ఆమోద ముద్ర వేయడంతో శుక్రవారం తెలంగాణవాదులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడంతో అన్ని రాజకీయ పార్టీలు, జేఏసీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కుల, ప్రజా సంఘాలు, విద్యార్థులు విజయోత్సవం
 జరుపుకున్నారు. బాణాసంచా పేలుళ్లు.. మిఠాయిల పంపిణీతో ఆనందం వ్యక్తపరిచారు.

 ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే జోగు రామన్న అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. టపాసులు కాల్చి, రంగులు చల్లుతూ నృత్యాలు చేశారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో సంఘ భవనం నుంచి బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీకి వెళ్లి శుక్రవారం విచ్చేసిన టీఆర్‌ఎస్, జేఏసీ, బీజేపీ నాయకులకు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముస్లింలు జుమా నమాజ్ తర్వాత పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించారు.

టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చారు. మంచిర్యాల మండలం హాజీపూర్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు, లక్సెట్టిపేటలో టీయూటీఎఫ్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. దండేపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు అంబేద్కర్, బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, కిషన్‌రెడ్డి ఫొటోలకు పాలాభిషేకం చేశారు. జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తాండూర్ మండల కేంద్రంలో ఏబీవీపీ, టీఆర్‌ఎస్వీ, బోథ్ మండల కేంద్రంలో జే ఏసీ విజయోత్సోవ రా్యాలీ నిర్వహించాయి. చెన్నూరు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్, రెబ్బెనలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

కలెక్టర్ చౌక్‌లో మహిళలు బతుకమ్మ ఆడారు. మందమర్రి పట్టణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులు బతుకమ్మలు, భోనాలతో శోభయాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మహిళతోనే సాధ్యమైయిందని ఇందుకు సోనియ గాంధీని కొనియాడారు. ఇచ్చోడలోని అంబేద్కర్ చౌర స్తా వద్ద టీఅర్‌ఎస్, బీజీపీ, జేఏసీల ఆధ్వర్యంలో విద్యార్థినులతో మానవహారం ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌లో 1969 ఉద్యోగుల సంఘం నాయకులు, మంచిర్యాలలోని సాయి అంధుల పాఠశాలలో తెలంగాణవాదులు మిఠాయిలు పంచి పెట్టారు. ఉట్నూరులో రాజుగొండు భవన్‌లో మహిళలు తెలంగాణ సంబరాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement