
సాక్షి, కడప: కడప మార్కెట్ యార్డులోని పసుపుకొమ్ముల గోడౌన్‌లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. పసుపుకొమ్ముల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి. సకాలంలో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అగ్నిప్రమాదం వల్ల భారీగా నష్టం వచ్చిందని నిర్వాహులు చెప్తున్నారు.