
పశ్చిమగోదావరి :పోలవరం ప్రాజెక్టు పనులేమీ పూర్తి కాకముందే టీడీపీ నేతలు మాత్రం డప్పాలు కొట్టుకుంటూ రైతులను ప్రాజెక్టు సందర్శనకు తీసుకువస్తున్నారు. ఆర్టీసీ బస్సుల పైకి ఎక్కించి మరీ వారిని తీసుకు వస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రైతన్నలను ఇలా ఆర్టీసీ బస్సు లోపలే కాదు... పైన కూడా ఎక్కించారు. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతూ టీడీపీ ప్రజాప్రతినిధులు ఇలాంటి సందర్శనలు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.