వెబ్‌సైట్‌లో ఇంగ్లిషు పాఠాలు | english lessons in website | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో ఇంగ్లిషు పాఠాలు

Feb 27 2015 12:49 AM | Updated on Sep 2 2017 9:58 PM

తనకున్న ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పదిమందికీ ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో 24 సంవత్సరాలుగా స్పోకెన్ ఇంగ్లిష్

మనోహర్ మరో ప్రయత్నం
ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం

 
సీతంపేట : తనకున్న ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పదిమందికీ ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో 24 సంవత్సరాలుగా స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్న మనోహర్ ఇప్పుడు వెబ్‌సైట్ ద్వారా సేవలందిస్తున్నారు. ఆయన మధురానగర్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఇప్పటివరకు సుమారు 23 వేల మందికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నత పదవుల్లో చేర్చిన ఘనత దక్కించుకున్నారు. కేవలం 30 రోజులలో అవలీలగా ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దే నైపుణ్యం మనోహర్ మాస్టారి సొత్తు. తను రూపొందించిన స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును సులభ మార్గాన్ని మరింతమందికి చేరువ చేసేందుకు manoharspokenenglish.com పేరిట వెబ్ సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. వీడియో గాలరీలో  రెండు గంటల నిడివి గ ల వీడియో పాఠాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఎవరైనా ఉచితంగా వెబ్ సైట్‌ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకునే వీలు కల్పించారు మనోహర్ మాస్టారు. అంతేకాదు ఉచితంగా డౌన్  లోడ్‌చేసుకునే సదుపాయం కూడా ఉంది.

వెబ్ సైట్‌లో  ఏముంది...

ఇంగ్లిష్ సులభంగా మాట్లాడేందుకు అవసరమైన 300 సింపుల్ వెర్బ్స్, నాలుగు చాప్టర్ల గ్రామర్‌ను పొందుపర్చారు. గ్రామర్‌లో స్రక్చర్స్, సింపుల్ ప్రెజెంటెన్స్, ప్రెజెంట్ కంటిన్యువస్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అనే నాలుగు టెన్స్‌లు, వాటిని 300 వెర్బ్స్‌తో ఎలా ఉపయోగించి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చునో వీడియోలో వివరించారు. నిత్యజీవితంలో ఉపయోగించే సంభాషణలతో వీడియోను పొందుపరిచారు.
 
 మరింత చేరువ కావాలని...

 ప్రపంచం మాట్లాడే భాష ఇంగ్లిష్. ఇంగ్లిష్ అంటే చాలా మందికి భయం. మాట్లాడటం రాక ఉద్యోగాాలను చేజార్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. నేటి సమాజంలో విద్య, వ్యాపారం,ఉద్యోగంలో రాణించాలంటే ఇంగ్లిష్‌లో మాట్లాడటం తప్పనిసరైపోయింది. ఎంఎన్‌సీ కంపెనీలలో కొలువు కావాలన్నా, ఆఖరికి ఇంటిలో పిల్లలకు చదువుచెప్పాలన్నా గృహిణులకు ఆంగ్లంలో మాట్లాడటం అవసరమైంది. ఇలాంటి వారిలో భయాన్ని పోగొట్టి కేవలం 30 రోజులలో ఇంగ్లిష్‌లో మాట్లాడేలా పుస్తకాన్ని, డీవీడీ రూపొందించాను. 1991 నుంచి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. ఈ సులభమైన పద్ధతి మరింతమందికి చేరువ కావడానికి సంఘమిత్ర సర్వీసెస్ ద్వారా మనోహర్ స్పోకెన్ ఇంగ్లిష్ డాట్ కామ్ వెబ్ సైట్‌ను అందుబాటులోకి తెచ్చాను.
 - దామోదల మనోహర్,
 జీవీఎంసీ ఉపాధ్యాయుడు, సీతంపేట
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement