విద్యుదాఘాతంతో ఓ రైతు మృత్యువాతపడ్డాడు.
కర్నూలు: విద్యుదాఘాతంతో ఓ రైతు మృత్యువాతపడ్డాడు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన రైతు కురవ దేవేంద్ర (28) ఉల్లిపంటకు నీరు పట్టెందుకు ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్లాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దేవేంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.