అంగన్‌వాడీ పిల్లలకు గు'గ'డ్డు.. కాలం

Eggs Distribution Delayed In Anganwadi Centres Chittoor - Sakshi

వారం రోజులుగా గుడ్డు నిల్‌

ఐసీడీఎస్‌కు ముందుచూపు కరువు

పౌష్టికాహార లోపం.. రక్తహీనత..వెరసి మాతాశిశు మరణాలు..వీటిని నివారించాలని స్త్రీశిశుసంక్షేమ శాఖ నిర్ణయించింది.ఇందుకు ఆరేళ్ల లోపు చిన్నారులు..బాలింతలు.. గర్భిణులకుపౌష్టికాహార పంపిణీ అందజేస్తోంది. అందులో భాగంగా కోడిగుడ్లు పంపిణీ చేస్తోంది. అయితే అధికారుల నిర్లక్ష్యం.. నిర్లిప్తత.. ఉదాశీనత.. ముందు చూపు లేమి.. ఫలితం అందని కోడిగుడ్లు...లబ్ధిదారులకు అవస్థలు ఇదీ
అంగన్‌వాడీలో వారం రోజులుగాకొనసాగుతున్న తంతు. 

పెద్దతిప్పసముద్రం: అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అం దించేందుకు ప్రభుత్వం కోడిగుడ్లను పంపిణీ చేసే ది. అయితే వారం రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్డు లేకుండానే ఆహారం పంపిణీ చేస్తున్నారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) ద్వారా అమలవుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతోనే కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయిందని ఈ సమస్య రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నెలకొందని అధికారులు పేర్కొంటున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా కోడి గుడ్లు అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలో ఘోరంగా విఫలమైంది.

అధికారుల నిర్లక్ష్యం.. అందని పౌష్టికం
ఐసీడీఎస్‌ అధికారుల నిర్లక్ష్యంతో అంగన్‌వాడీ చి న్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన కోడిగుడ్లు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు వారానికి నాలుగు కోడిగుడ్లను అందించాలి. ఇందుకు ఒక్కొక్క కేంద్రానికి వారానికి రంగుల ముద్రలున్న కోడిగుడ్లు వందకు పైగా అందించాల్సి ఉంది. అయితే ఈ వారానికి సంబంధించి గుడ్లు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా కాలేదు. గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు గడువు ముగియడంతోనే గుడ్లు అందలేదన్న వాదన వినిపిస్తోంది. అధికారులు మాత్రం బిల్లులు రాకపోవడంతో గుడ్లు రాలేదంటున్నారు. వాస్తవంగా ముందు చూపుతో గడువు ముగుస్తున్న తరుణానికి ముందుగానే మళ్లీ టెండ ర్లు పిలవాల్సిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందలేదు. 

ఆగస్టు నుంచి సరఫరా అవుతాయి
కోడి గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు గడువు ముగిసింది. కొత్త టెండర్లు ఆహ్వానిం చే వరకు పాత కాంట్రాక్టర్‌కే కొద్ది నెలలు సరఫరా చేయమని చెప్పారు. ఆగస్టు నుంచి గుడ్లు సరఫరా చేసే దిశగా చర్యలు చేపడతాం.  – ఉషా ఫణికర్,ప్రాజెక్ట్‌ డైరెక్టర్, చిత్తూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top