మహానేతపై నిందలు వేయడం తగదు: కొణతాల | Don't blame YSR on Telangana issue, says Konatala Rama Krishna | Sakshi
Sakshi News home page

మహానేతపై నిందలు వేయడం తగదు: కొణతాల

Aug 26 2013 4:31 PM | Updated on Aug 8 2018 5:51 PM

మహానేతపై నిందలు వేయడం తగదు: కొణతాల - Sakshi

మహానేతపై నిందలు వేయడం తగదు: కొణతాల

తెలంగాణ ఏర్పాటు విషయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పై నిందలు వేయడం తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొణతాల రామకృష్ణ సూచించారు.

రాష్ట్ర విభజనకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బీజం వేశారని కాంగ్రెస్, టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో రోశయ్య కమిటీ విధివిధానాలు కాంగ్రెస్, టీడీపీ నేతలకు తెలియవా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో లేని వ్యక్తిపై అభండాలు వేయడం తగదు అని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎందుకీ డ్రామాలు కొణతాల మండిపడ్డారు. 
 
అప్పటి రోశయ్య కమిటీలో నేనూ సభ్యుడినే అని కొణతాల అన్నారు. వైఎస్ జగన్ రాజకీయ లబ్ధి కోసం, బెయిల్‌ కోసం దీక్ష చేయాల్సిన అవసరం లేదు అని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి వైఖరి స్పష్టం చేయాలి ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై లేఖకు కట్టుబడి ఉంటారో.. సమైక్యాంధ్రకు  కట్టుబడి ఉంటారో స్పష్టం చేయాలి  కొణతాల సూచించారు. 
 
తెలంగాణ ఏర్పాటు విషయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పై నిందలు వేయడం తగదని కొణతాల సూచించారు. అప్పటి పరిస్థితుల్లో శాసనసభ్యులు నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేరవేయడం జరిగిందని ఆయన తెలిపారు.
 
తెలంగాణ విషయంపై రాజశేఖరరెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందని.. అందుకే  2009 శాషనసభలో స్పష్టమైన ప్రకటన చేసి..రోశయ్య అధ్యక్షతన కమిటీ వేసిన విషయాన్ని మీడియా సమావేశంలో కొణతాల వెల్లడించారు. రాజకీయ లబ్ది కోసం చనిపోయిన మహానేతపై నిందలు వేయడం తగదు ఆయన అన్నారు. 
 
రాష్ట్ర విభజనకు, ప్రస్తుత పరిస్థితులకు కారణం తెలుగుదేశం పార్టీ, ఆపార్టీ అధినేత చంద్రబాబేనని అన్నారు. రాష్ట్ర విభజనకు సుముఖం అంటూ తెలుగుదేశం పలు పర్యాయాలు లేఖలు ఇవ్వడం జరిగింది అయన తెలిపారు. 
 
టీఆర్ఎస్ తోపొత్తు పెట్టుకున్నపుడు, 2012 లో కూడా లేఖ ఇచ్చిందని, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆమోదిస్తూ కూడా చంద్రబాబు ప్రకటన చేశారన్నారు. 4 లక్షల కోట్లతో సీమాంధ్రను అభివృద్ధి చేసుకుందామని చంద్రబాబు తెలిపిన విషయాన్ని మీడియా ముఖంగా తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement