నన్నే సస్పెండ్ చేస్తారా? | Do you suspend me? | Sakshi
Sakshi News home page

నన్నే సస్పెండ్ చేస్తారా?

Apr 26 2014 4:11 AM | Updated on Sep 2 2017 6:31 AM

నన్నే సస్పెండ్ చేస్తారా?

నన్నే సస్పెండ్ చేస్తారా?

నన్నే సస్పెండ్ చేస్తారా? అంటూ ఓ ఆర్టీసీ డ్రైవర్ వినూత్న నిరసన తెలిపాడు. ఏకంగా బస్సుతో ఉడాయించి సంచలనం సృష్టించాడు. తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన జరిగింది

బస్సుతో ఉడాయించి నిరసన తెలిపిన ఆర్టీసీ డ్రైవర్

 రంపచోడవరం/గోకవరం    నన్నే సస్పెండ్ చేస్తారా? అంటూ ఓ ఆర్టీసీ డ్రైవర్ వినూత్న నిరసన తెలిపాడు. ఏకంగా బస్సుతో ఉడాయించి సంచలనం సృష్టించాడు. తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన జరిగింది. గోకవరం డిపోలో పదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేసి ఏడీసీగా పదోన్నతి పొందిన సీహెచ్ వెంకన్నను రూ.లక్ష దుర్వినియోగానికి పాల్పడిన అభియోగంపై పది నెలల కిందట సస్పెండ్ చేశారు.

దీనిపై నిరసన తెలపాలనుకున్న వెంకన్న ఉదయం ఐదుగంటల సమయంలో గుర్తేడు వెళ్లేందుకు పాయింట్‌లో పెట్టిన బస్సును రంపచోడవరం వైపు నడుపుకుంటూ వెళ్లాడు. విషయం తెలిసిన డిపో మేనేజర్ వీవీఎస్ మూర్తి సిబ్బందిని వెంటబెట్టుకుని రంపచోడవరం చేరుకున్నారు. అప్పటికే వెంకన్న బస్సును అక్కడి ఐటీడీఏ కార్యాలయం ఎదుట వదిలి పరారయ్యాడు. డిపో మేనేజర్ ఫిర్యాదుతో గోకవరం ఎస్‌ఐ ఆర్.శివాజీ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement