
కేసీఆర్‌ను కలిసిన మాజీమంత్రి ధర్మాన
ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గ్రీన్‌లాండ్స్‌లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్: ఆంధప్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గ్రీన్‌లాండ్స్‌లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అరగంటపాటు ఆయన కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణ నూతన రాష్ర్టం ఏర్పడ్డాక, సీఎంగా పదవి చేపట్టిన అనంతరం కేసీఆర్‌ను ధర్మాన కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ధర్మాన మాట్లాడుతూ.. కేవలం మర్యాదపూర్వకంగానే కేసీఆర్‌ను కలిశానన్నారు.