భోగాపురానికే ఛాన్స్ !

భోగాపురానికే  ఛాన్స్ ! - Sakshi


 సాక్షి ప్రతినిధి, విజయనగరం : విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించే అవకాశాల్లేకపోవడం, నక్కపల్లిలో వాతావరణ పరిస్థితులు అను కూలంగా ఉండకపోవడం వంటి అంశాలు భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కలిసివస్తున్నాయి. భోగాపురంలో కొత్త ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యేలా ఉంది. ప్రయాణికుల రద్దీ కన్నా, కార్గో సర్వీసులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నిర్మించేందుకు కేంద్రం ఆసక్తి చూపుతోంది. అందుకు తగ్గ సాధ్యాసాధ్యాలను ఇప్పటికే పరిశీలించింది. పౌర విమానయాన శాఖ వ ర్గాలు కూడా సానుకూలంగా ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్య లు కూడా అందుకు ఊతమిస్తున్నాయి.

 

  జిల్లాకొక ఎయిర్‌పోర్ట్ అన్న ప్రతిపాదన మిగతా జిల్లాల్లో సాధ్యమవుతుందో లేదో గాని జిల్లాలోని భోగాపురానికి మాత్రం కాస్త సానుకూలత కన్పిస్తోంది. ఇందుకు పొరుగు జిల్లాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితులే కారణం. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించేందుకు అవకాశం లేదని పౌర విమానయాన శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే నక్కపల్లిలో ఏర్పా టు చేయాలన్న యోచనకు అక్కడి వాతావరణ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి. ముఖ్యంగా విమాన రాకపోకలకు గాలులు,   సంకే తాలు అనుకూలంగా ఉండవన్న అభిప్రాయానికొచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలో భోగాపురమే సరైనదని భావిస్తున్నట్టు సమా చారం.

 

 విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాటుకు సర్కార్ యోచిస్తోంది. అందులో  భాగంగానే నక్కపల్లిలోగాని, భోగాపురంలో గాని ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతి పాదనలు పంపించింది. ఇందుకు తగ్గ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఇటీవల పౌర విమానయాన శాఖాధికారులు వచ్చి వెళ్లారు. అటు నక్కపల్లి, ఇటు భోగాపురం వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత భోగాపురమే సరైనదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక్కడ ఏర్పాటు చేస్తే మరికొన్ని ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీకాకుళం, విజ యనగరం, విశాఖపట్నం తీరప్రాంతానికొచ్చిన సరుకులను ఇక్కడి నుంచి కార్గో సర్వీసుల ద్వారా రవా ణా చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది.

 

 పయాణికుల కంటే సరుకుల రవాణాకు ఎక్కువగా దోహద పడుతుందని విశ్లేషిస్తున్నారు. అలాగే విజ యన గరం- రాయపూర్ కనెక్టవిటీ రైల్వే లైన్ ఆధునీకరణ దశలో ఉం దని, విద్యుద్ధీకరణ జరిగితే పనులు పూర్తవుతాయని, రైల్వే లైన్ పూర్తయ్యాక రైళ్ల ద్వారా సరుకుల రవాణా పెరుగుతుందని, దానికి కనెక్టవిటీగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనికొస్తోందని విమానయాన శాఖ అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రైల్వే లైన్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని రైల్వే అధి కారులపై ఇప్పటికే ఒత్తి డి చేసినట్టు సమాచారం. ఇదంతా గమనిస్తుంటే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు మార్గం సు గమవుతుందని స్పష్టమవుతోంది. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు  ఊతమిస్తున్నాయి. నక్కపల్లిలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, భోగాపురంలో సానుకూల పరిస్థితులున్నాయని ఆయన విలేకర్ల వద్ద తెలిపారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top