
కళింగపట్నం పోర్ట్ లో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
హుదూద్ తుఫాను నేపథ్యంలో ప్రధాన ఓడరేవుల్లో హై-అలర్ట్ ప్రకటించారు. కళింగపట్నం, గంగవరం ఓడరేవుల్లో శనివారం 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
విశాఖ : హుదూద్ తుఫాను నేపథ్యంలో ప్రధాన ఓడరేవుల్లో హై-అలర్ట్ ప్రకటించారు. కళింగపట్నం, గంగవరం ఓడరేవుల్లో శనివారం 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, మచిలీపట్నం పోర్ట్ల్లో అయిదో నెంబర్, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక సూచికలను ఎగురవేశారు. ఓడ రేవుల్లో మొత్తం 11వ నెంబర్ వరకూ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. సాధారంగా అయిదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయితేనే తుఫాను ప్రభావం భారీగా ఉన్నట్లు లెక్క. ఇక 11వ నెంబర్ జారీ అయితే మొత్తం సమాచార వ్యవస్థే స్తంభించిపోతుంది.