కడపలోని నారాయణ కళాశాలలో విద్యార్థినుల మృతికి నిరసనగా వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు బుధవారం నగరంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.
కడప: కడపలోని నారాయణ కళాశాలలో విద్యార్థినుల మృతికి నిరసనగా వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు బుధవారం నగరంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. బంద్ కు మద్దతుగా కడప కోటిరెడ్డి సర్కిల్‌లో బైఠాయించి ఆందోళన చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వైఎస్సార్‌సీపీ నేత రవీంద్రనాథరెడ్డి సహా వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ నేతలందర్నీ పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెల్లవారుజాము నుంచే ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి వారిని బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయినా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటిస్తున్నారు.