విభజన హామీలను కేంద్ర విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు సాధించలేక పోయిందని సీపీఐ పార్టీ విమర్శించింది.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
Mar 1 2016 11:56 AM | Updated on Aug 18 2018 5:57 PM
అనంతపురం: విభజన హామీలను కేంద్ర విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు సాధించలేక పోయిందని సీపీఐ పార్టీ విమర్శించింది. కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందంటూ మంగళవారం ఉదయం అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి అనంతరం క్లాక్‌టవర్ చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు..చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనాన్ని, కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు.
Advertisement
Advertisement