కరోనా పోరు: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు

Corona Virus: Huge People Donating Money To AP CM Relief Fund - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున కోటి రూపాయలు విరాళం అందించారు.  విరాళ చెక్కును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త బాచిన కృష్ణ  చైతన్య.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. అలాగే దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల 55 వేలు విరాళం ఇచ్చారు. 

ఇలా అనేకమంది ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. వారి వివరాలు..

పశ్చిమ గోదావరి : జిల్లాకు చెందిన శ్రీ వైష్టవి స్పింటెక్స్‌(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌  రూ.50 లక్షలు విరాళం అందించారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో  శ్రీ వైష్టవి స్పింటెక్స్‌(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌ ఛైర్మన్‌ రెడ్డి శ్రీనివాస్, రెడ్డి రంగబాబు(ఎండీ) విరాళ చెక్కును సీఎం జగన్‌కు అందించారు.

వైఎస్సార్‌ విద్యుత్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సభ్యులు(ఏపి ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, ఏపీఎస్‌పీడీసీఎల్‌, ఏపీఈపీడీసీఎల్‌, ఏపీసీపీడీసీఎల్‌) ఒక రోజు వేతనాన్ని రూ. 75,50,600  విరాళంగా అందజేశారు. చెక్కుకు సంబంధించిన వివరాలను యూనియన్ గౌరవ అధ్యక్షుడి హోదాలో  ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. సీఎం జగన్‌కు అందజేశారు.
 
► తణుకు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 58,47,833 లను  విరాళంగా అందించారు. ఈ చెక్కును ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సీఎం జగన్‌కు అందించారు.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌  కార్పొరేషన్‌ ఉద్యోగులు రూ.50 లక్షలు విరాళం. ఈ చెక్కును స్కిల్‌  డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి. అనంతరాము, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎండీ, సీఈఓ అర్జా శ్రీకాంత్‌.. ముఖ్యమంత్రికి అందించారు

విశాఖ : కరోనా నియంత్రణకు ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 21.30 లక్షల చెక్కును కలెక్టర్ వినయ్ చంద్‌కు అందించారు.  అలాగే మాడుగుల నియోజకవర్గం ప్రజల కూడా ముప్పై లక్షల 7 వేలు చెక్కును కలెక్టర్‌కు అందించారు.

రేసపువాణిపాలెం ఎక్స్- సర్వీస్  మెన్ వెల్ఫేర్  అసోసియేషన్ రూ. 27200  విరాళంగా ఇచ్చారు. ఈ చెక్కును విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కేకే రాజు అందజేశారు.

వైఎస్సార్‌ కడప: పోరుమామిళ్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మదర్ థెరీసా ఫౌండేషన్ స్వచ్చంద సంస్థ వాళ్లు  ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చేతుల మీదుగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 వేల చొప్పున విరాళం ఇచ్చారు.

అనంతపురం : రాయదుర్గం పట్టణ మహిళా సంఘాల సమాఖ్య తరపున మెప్మా సంఘాలు .. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డికి లక్ష రూపాయల చెక్కను  అందజేశారు.

తూర్పుగోదావరి(కాకినాడ) : ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ పరుచూరి కృష్ణారావు రూ. 5 లక్షలు, పోలీసు శాఖకు రూ. 2 లక్షలు విరాళం అందజేశారు.  అలాగే  రాజమండ్రి హర్షవర్ధన విద్యాసంస్థల చైర్మన్ హరి ప్రసాద్.. లక్ష రూపాయలు సహాయాన్ని ఎంపీ భరత్‌రామ్‌కు అందజేశారు.

కృష్ణా: కైకలూరు మండలం గోకర్ణపురం గ్రామ పెద్దలు 50వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకి అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top