హైకమాండ్‌కు నచ్చిందే రంభ: జేసీ | congress high command won't back foot on bifurcation: jc diwar reddy | Sakshi
Sakshi News home page

హైకమాండ్‌కు నచ్చిందే రంభ: జేసీ

Dec 8 2013 12:32 PM | Updated on Mar 18 2019 7:55 PM

హైకమాండ్‌కు నచ్చిందే రంభ: జేసీ - Sakshi

హైకమాండ్‌కు నచ్చిందే రంభ: జేసీ

విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తనకు నచ్చిందే రంభ అనే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఎవరి మాటా వినే పరిస్థితి లేదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. విభజనలో నిబంధనలు, సంప్రదాయాలు పాటించ కుండా తనకు నచ్చిందే రంభ అనే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజనను అడ్డుకుంటామనే ఆశతో సీఎం కిరణ్ ఉన్నా.. వాస్తవానికి విభజన ఆగే పరిస్థితే లేదన్నారు.

విభజన ఖాయమైనందున ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉండాల్సిన పనిలేదని, కేంద్రం ఆర్థిక సాయం చేస్తానని చెప్పినందున వెంటనే కొత్త రాజధానిని ఎంపిక చేసుకుని వెళ్లిపోవడమే మేలన్నారు. సీఎల్పీ కార్యాలయం వద్ద శనివారం ఆయన  మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement