సీఎం కిరణ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు | CM Kiran Kumar Reddy playing worst politics, says YSRCP MLA G.Srikanth reddy | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు

Sep 28 2013 11:30 AM | Updated on Jul 29 2019 5:31 PM

సీఎం కిరణ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు - Sakshi

సీఎం కిరణ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు

సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి నిప్పులు చెరిగారు.

సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ... సీఎం కిరణ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసిపోతున్న దశలో త్యాగాలు చేస్తానని ఆయన ప్రకటించడాన్ని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

 

ప్రజలను మభ్యపెట్టేందుకే సీఎం అలా మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిన్నాభిన్నం అవడానికి యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులే ప్రధానకారణమని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్ర సమైక్యతపై తీర్మానం చేయాలని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విభజనపై విలేకర్ల సమావేశంలో  చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement