ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో సందర్శకులు, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 30.5 శాతం మాత్రమే పరిష్కారమయ్యారుు.
సమీక్షలో ఆయనకే వివరించిన అధికారులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో సందర్శకులు, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 30.5 శాతం మాత్రమే పరిష్కారమయ్యారుు. ఈ విషయాన్ని అధికారులు నేరుగా ఆయనకే తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఆయన తానిచ్చిన హామీల అమలు అంశంపై 12 శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మొత్తం 926 హామీలకుగాను 283 హామీలు మాత్రమే పూర్తిగా పరిష్కారమయ్యాయని అధికారులు ఆయనకు వివరించారు. 628 హామీలు ఇంకా పరిష్కార దశలో ఉన్నాయని, మరో 15 హామీల అమలుకు చొరవ తీసుకోవాల్సివుందని తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ... తాను జిల్లాల్లో పర్యటించే ముందే గతంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు కావాలని ఆదేశించారు.
13.39 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాలి
పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ నెల 20వ తేదీలోపు 13.39 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణ సంస్థలకు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై ఆయన సోమవారం వర్చువల్ ఇన్‌సపెక్షన్ నిర్వహించారు. కాంక్రీట్ పనులకు అవసరమైన ఎక్విప్‌మెంట్, క్రషర్ ప్లాంట్ ఏర్పాటు వంటివి షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని, స్పిల్‌వే పనుల శంకుస్థాపన డిసెంబరు రెండో వారంలో జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.