గతంలో నిలిచిపోయిన సివిల్ జడ్జీల భర్తీ ప్రక్రియను ఉమ్మడి హైకోర్టు మళ్లీ ప్రారంభించింది.
హైదరాబాద్: గతంలో నిలిచిపోయిన సివిల్ జడ్జీల భర్తీ ప్రక్రియను ఉమ్మడి హైకోర్టు మళ్లీ ప్రారంభించింది. గతంలో ఆగిపోయిన 97 సివిల్ జడ్జి పోస్టులకు వచ్చే నెల 8న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించాలని హైకోర్టు నిర్ణయించింది. ఇదే సమయంలో 2015 సంవత్సరానికి ఖాళీగా ఉన్న 34 సివిల్ జడ్జి పోస్టులను నోటిఫై చేసింది.ఈ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ జిల్లాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది.