'40 ఏళ్ల అనుభవంతో గ్రామ వ్యవస్థను నిర్వీర్యం చేశారు'

Chandrababu Weakens Village System With His 40 Years Of Experience - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను వేలెత్తి చూపే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవంతో చంద్రబాబు నాయుడు  గ్రామ వ్యవస్థతో పాటు ఆర్థిక వనరులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బ్రోకర్లతో జన్మభూమి కమిటీలు వేసి ప్రజల మధ్య రాజకీయ వైషమ్యాలను పెంచి పోషించారని ఆరోపించారు. రాష్ట్రంలో రూ. 24వేల కోట్లు బకాయిలు పెట్టి బొగ్గులేకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు విధానాల వల్లే ప్రస్తుతం ప్రజలు కరెంట్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధర్మాన ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top