రోజుకో మెలిక.. పూటకో పాచిక | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

రోజుకో మెలిక.. పూటకో పాచిక

Aug 24 2014 12:42 AM | Updated on Sep 2 2017 12:20 PM

రోజుకో మెలిక.. పూటకో పాచిక

రోజుకో మెలిక.. పూటకో పాచిక

రుణమాఫీ భారాన్ని వీలైనంత తగ్గించుకోవాలన్న కక్కుర్తితో రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతోంది. రోజుకో ఆంక్ష విధిస్తోంది. తద్వారా అనేక మంది అన్నదాతలు మాఫీకి అనర్హులయ్య్యేలా

 అమలాపురం టౌన్ :రుణమాఫీ భారాన్ని వీలైనంత తగ్గించుకోవాలన్న కక్కుర్తితో రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతోంది. రోజుకో ఆంక్ష విధిస్తోంది. తద్వారా అనేక మంది అన్నదాతలు మాఫీకి అనర్హులయ్య్యేలా చేస్తోంది. ఈ నిబంధనల మెలికలతో రైతులు మానసికంగా నలిగిపోతున్నారు. ఇప్పటికే మాఫీకి సంబంధించి జారీ చేసిన జీఓ:174 లోని లోపాలు, లొసుగులపై రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా మాఫీకి అర్హతగా మరిన్ని ఆధారాలను సహకార సంఘాలు, డీసీసీబీ బ్రాంచిల్లో  అందించాలని సర్కారు హైరానా పెడుతోంది.
 
 మాఫీ ఫలం పొందాలంటే సహకార సంఘాల్లో రుణం తీసుకున్న ప్రతి రైతూ ఆధార్ కార్డు జిరాక్సును అందించాలని ఇప్పటికే మెలిక పెట్టారు. పరిమితికి మించి ఎవరికీ మాఫీ కాకూడదన్న ముందు చూపుతోనే ప్రభుత్వం ఈ నిబంధన పెట్టింది. జిల్లాలో సహకార సంఘాల సభ్యులు గా ఉన్న దాదాపు 90 వేల మంది రైతుల్లో 80 శా తం ఆధార్ జిరాక్సులను ఇప్పటికే అందజేశా రు. ఆధార్ కార్డులు ఇంకా అందక, నంబరు రా క.. ఇవ్వలేకపోయిన 20 శాతం మంది మాఫీ వ ర్తిస్తుందో, లేదోనని ఆందోళన చెందుతున్నారు.
 
 దస్తావేజులు చాలవట..
 ఆధార్ మెలికతో ఆగని ప్రభుత్వం.. తాజాగా పట్టాదారు పాస్ పుస్తకాల నిబంధనను తెరపైకి తెచ్చింది. మాఫీ పొందే ప్రతి రైతూ పట్టాదారు పుస్తకాన్ని చూపించాలని సహకార అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో చాలామంది రైతులకు అధికారులు ఆ పుస్తకాలు జారీ చేయలేదు. రైతుల భూముల దస్తావేజుల ఆధారంగానే సహకార సంఘాలు రుణాలిచ్చాయి. చాలా మంది రైతులకు పట్టాదారు పుస్తకాలు లేవని తెలిసీ ఈ నిబంధన పెట్టడమంటే మాఫీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నమేనని అమలాపురంలో శుక్రవారం జరిగిన సమావేశంలో సహకార, రైతు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.
 
 ఖాతాలు తెరిచేందుకు కష్టాలు
 సహకార సంఘాల్లో సభ్యుడిగా ఉండి, మాఫీకి అర్హుడయ్యే ప్రతి రైతూ తమ డీసీసీబీ బ్రాంచిలో పొదుపు ఖాతా తెరవాలన్న నిబంధనను కూడా ప్రభుత్వం తాజాగా విధించింది. మొదట్లోనే ఈ ఆంక్ష పెట్టినా.. ఈ విధానం సరికాదని ఉద్యోగులు చెప్పటంతో ఆ నిబంధన జోలికి వెళ్లవద్దని మౌఖికంగా చెప్పారు. అయితే ప్రభుత్వం తాజా నిబంధనల్లో పొదుపు ఖాతా ను తప్పని సరిచేసింది. ప్రతి రైతుకు ఏదో వాణి జ్య బ్యాంకులో పొదుపు ఖాతా ఉంది. ‘రేపు మాఫీ సొమ్ములు విడుదలైతే డీసీసీబీ బ్రాంచి లో మీరు తెరిచే ఖాతాలో జమవుతాయని అధికారులు చెబుతున్నారు. మాఫీ సొమ్ము విడుదల చేస్తే రైతులకున్న వివిధ వాణిజ్య బ్యాం కుల ఖాతాల్లో జమ చేయవచ్చు. అయితే ఈ నిబంధన వల్ల ఎక్కడ మాఫీకి అనర్హులమవుతామోనన్న జంకుతో రైతులు ప్రయాస పడి  మం డలానికి ఒకటే ఉన్న డీసీసీబీ బ్రాంచిలకు వెళ్లి ఖాతాలు తెరుస్తున్నారు. మాఫీకి మరో ఆరు నె లలు పట్టే అవకాశం ఉందంటున్న క్రమంలో ఈలోగా మరెన్ని ఆంక్షలు విధిస్తారోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement