16 లేదా 17న తుది చార్జిషీట్ | CBI to file Final Chargesheet on Sept 16 or 17 in YS Jagan assets Case | Sakshi
Sakshi News home page

16 లేదా 17న తుది చార్జిషీట్

Sep 13 2013 1:48 AM | Updated on Jul 6 2019 12:52 PM

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వచ్చే సోమవారం లేదా మంగళవారం తుది చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ.. ఇక్కడి ప్రత్యేక కోర్టుకు నివేదించింది.

ప్రత్యేక కోర్టుకు నివేదించిన సీబీఐ
 జగన్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు గడువివ్వాలని వినతి

 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వచ్చే సోమవారం లేదా మంగళవారం తుది చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ.. ఇక్కడి ప్రత్యేక కోర్టుకు నివేదించింది. దర్యాప్తునకు సుప్రీంకోర్టు విధించిన గడువు పూర్తయిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు గురువారం విచారించారు. అయితే బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు తమకు గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది అభ్యర్థించారు.  బుధవారం కౌంటర్ దాఖలు చేస్తామని నివేదించారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు.
 
మోపిదేవికి బెయిల్ వద్దు: సీబీఐ
వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై వాదనలను ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement